Home > జాతీయం > Amit Shah : లోక్ సభ ఎన్నికల వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం

Amit Shah : లోక్ సభ ఎన్నికల వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం

Amit Shah : లోక్ సభ ఎన్నికల వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
X

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్‌ను కేంద్రం నోట్‌ఫై చేసింది.ఈ బిల్లు 2019 డిసెంబర్‌లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందినా నిరసనల కారణంగా అమలవలేదు. ఎన్నికలకు ముందు దీనిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవలే తెలిపారు.ఈ చట్టం ప్రకారం పాక్,ఆప్గన్, బంగ్లాదేశ్‌ల నుంచి 2015సం.లోపు దేశంలోకి వచ్చిన ముస్లితేరులకు పౌరసత్వం ఇస్తుంది. 2019 డిసెంబర్‌లోనే పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకొన్నది మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్‌ 31 కంటే ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్‌ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

అయితే 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈశాన్య రాష్ట్రల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌ను బీజేపీ సర్కారు తెరపైకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఏఏ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. తాజాగా ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ మేరకు నిబంధనలను నోటిఫి చేసింది. ఇప్పటికే అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు సైతం ఎన్నికలకు ముందే సీసీఏను అమలులోకి తీసుకువస్తామని ప్రకటించారు.




Updated : 11 March 2024 1:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top