Home > జాతీయం > ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్లో ఇండియా.. విపక్షాలపై పీఎం మోడీ ఫైర్..

ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్లో ఇండియా.. విపక్షాలపై పీఎం మోడీ ఫైర్..

ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్లో ఇండియా.. విపక్షాలపై పీఎం మోడీ ఫైర్..
X

విపక్షాలపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసనలో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష కూటమి ఎంపీలు చేస్తున్న ఆందోళనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ మండిపడినట్లు తెలుస్తోంది. ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను తాను ఇంతవరకు చూడలేదని ప్రధాని మోడీ అన్నట్లు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పేరులో ఇండియా ఉంటే సరిపోదన్న మోడీ.. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తదితర పేర్లలో కూడా ఇండియా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారని అన్నారు. కూటమికి ఇండియా అని పేరు పెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారని ప్రధాని మండిపడినట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.

మోడీని వ్యతిరేకించడమే ఏకైక లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఓటమి, అలసట, నిరాశలో కూరుకుపోయిన ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే విపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ప్రజల మద్దతుతో 2024లోనూ తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు రవిశంకర్ చెప్పారు.

Updated : 25 July 2023 7:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top