Home > జాతీయం > జీ 20 సమ్మిట్ సక్సెస్.. ఆ 450 మందికి మోడీ స్పెషల్ డిన్నర్..

జీ 20 సమ్మిట్ సక్సెస్.. ఆ 450 మందికి మోడీ స్పెషల్ డిన్నర్..

జీ 20 సమ్మిట్ సక్సెస్.. ఆ 450 మందికి మోడీ స్పెషల్ డిన్నర్..
X

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీ 20 సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సదస్సు విజయవంతం కావడంతో కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. సమ్మిట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులను ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ విందులో ప్రధాని మోడీ వారితో కలిసి భోజనం చేయనున్నారు.

జీ 20 సదస్సు సందర్భంగా కానిస్టేబుళ్ల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు అద్బుతంగా పనిచేసిన సిబ్బంది లిస్టు రూపొందించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాను కోరినట్లు తెలుస్తోంది. ఈ విందులో మొత్తం 450 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారని సమాచారం. జీ 20 సమ్మిట్‌ జరిగిన భారత్‌ మండపంలో ఈ వారంలోనే ఈ విందు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




Updated : 13 Sept 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top