Home > జాతీయం > మోదీ చెల్లెలి వీడియో వైరల్..ఎంతబాగున్నారో..

మోదీ చెల్లెలి వీడియో వైరల్..ఎంతబాగున్నారో..

మోదీ చెల్లెలి వీడియో వైరల్..ఎంతబాగున్నారో..
X

ఒకరు దేశ ప్రధానమంత్రి సోదరి..మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. వీరిద్దరూ ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్‌లోని ఒక ఆలయంలో కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకుని ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. పీఎం, సీఎం సోదరీమణుల ఆప్యాయంగా పలకరించుకున్న వీడియోనును ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ నేత అజయ్ నంద. దీంతో వీరిద్దరి సింప్లిసిటీకీ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంటర్నెట్‏లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

పీఎం మోదీ సోదరి వాసంతీబెన్ శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ పౌరీ గర్వాల్‌లోని నీలకంఠ మహదేవ్ ఆలయానికి వెళ్లారు. అక్కడి నుండి ఆమె కొఠారీలోని పార్వతిదేవి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ వాసంతీబెన్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవ్‌ను కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తరువాత చిరునవ్వులలతో ఆలింగనం చేసుకుని రాజకీయాలకు అతీతంగా కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం పార్వతీ దేవి ఆలయానికి వెళ్లి ఇద్దరూ పూజలు నిర్వహించారు. అయితే వీరిద్దరి సోదరులు భారత్‎లోనే పవర్‎ఫుల్ స్థానాల్లో ఉన్నప్పటికీ ఎంతో సాధారణంగా కనిపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల కలయికగా ఎంతో చక్కగా కనిపించారు. ఇలాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులను చూడటం ఎంతో ఆనందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వీరి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.




PM Modi’s sister Basantiben and CM Yogi’s sister Shashi meeting exemplifies the essence of simplicity, Indian culture, and tradition. It's heartening to witness their bond, transcending politics, and making us proud of these two remarkable individuals representing India's values.… pic.twitter.com/CCYLKkvqVb

Updated : 5 Aug 2023 8:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top