Home > జాతీయం > బిపోర్జాయ్ తుఫానుపై ప్రధాని మోడీ సమీక్ష

బిపోర్జాయ్ తుఫానుపై ప్రధాని మోడీ సమీక్ష

బిపోర్జాయ్ తుఫానుపై ప్రధాని మోడీ సమీక్ష
X

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. దీంతో అరేబియా తీర రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తుఫాను ప్రభావం భారీగా ఉండే అవకాశముండటంతో కేంద్రం సైతం అప్రమత్తమైంది. బిపోర్జాయ్ తుఫాను ప్రభావంపై ప్రధాని నరేంద్రమోడీ సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఆయన ఉన్నతాధికారుతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితి, ముప్పును వీలైనంత వరకు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు సహాయక చర్యలపై ప్రధాని సమీక్షించనున్నట్లు సమాచారం.

బిపోర్‌జాయ్‌ తుఫాను గుజరాత్‌లోని కచ్‌, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15వ తేదీన తీరాన్ని దాటనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ కచ్‌ తీరాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. కచ్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలిక పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవడంతో పాటు తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

తుఫాను కారణంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పలు మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బిపోర్జాయ్ ప్రభావంతో గుజరాత్‌లోని కచ్‌, జామ్‌నగర్‌, మోర్బి, గిర్‌ సోమనాథ్‌, పోర్‌బందర్‌, ద్వారక జిల్లాలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. అటు మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశముండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Updated : 12 Jun 2023 12:43 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top