Home > జాతీయం > పాత పార్లమెంటులో ప్రధాని చివరి ప్రసంగం.. మోడీ భావోద్వేగం..

పాత పార్లమెంటులో ప్రధాని చివరి ప్రసంగం.. మోడీ భావోద్వేగం..

పాత పార్లమెంటులో ప్రధాని చివరి ప్రసంగం.. మోడీ భావోద్వేగం..
X

పార్లమెంటు సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందని ప్రధాని మోడీ అన్నారు. సెంట్రల్ హాల్లో చివరి ప్రసంగం చేసిన ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యాంగం రూపుద్దికోవడంతో పాటు ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారాన్ని కూడా సెంట్రల్ హాలులోనే జరిగిందని గుర్తుచేశారు. 1952 నుంచి వివిధ దేశాలకుచెందిన 41 మంది దేశాధినేతలు ఈ హాలులో ప్రసగించారని చెప్పారు. మూడు మువ్వన్నెల జెండాను సెంట్రల్ హాల్లోనే రూపొందించుకున్నామన్న మోడీ.. ఇప్పటి వరకు రాష్ట్రపతులు ఉభయ సభలను ఉద్దేశించి 86 సార్లు ప్రసంగించిన విషయాన్ని ప్రస్తావించారు. 4వేలకు పైగా చట్టాల ఆమోదం ఇక్కడే జరిగిందని, అనేక కీలక బిల్లులను ఉమ్మడి సమావేశాల ద్వారా చట్టంగా మార్చుకున్నామని చెప్పారు. వరకట్న నిషేధం, బ్యాంకింగ్ సంస్కరణలు, తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్ తలాక్ చట్టం, జమ్మూకాశ్మీర్కు ఆర్టికల్ 370 నుంచి విముక్తి ఈ భవనంలోనే జరిగిందని గుర్తుచేశారు.

ప్రపంచమంతా ఇప్పుడు భారత్ ఆత్మనిర్బర్ గురించి చర్చిస్తోందని మోడీ అన్నారు. ఆలోచనలు విస్తృతం చేయకపోతే పెద్ద కలలు కనలేమని చెప్పారు. చిన్న చిన్న విషయాలపై రాద్దాంతం చేయకుండా దేశం కోసం పాటు పడాలని సూచించారు. భారత్ ముందడుగు వేసేందుకు ఎంపీలంతా సహకరించాలని మోడీ కోరారు.

అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగత ప్రసంగం చేస్తారు. అనంతరం సీనియర్ పార్లమెంటేరియన్ అయిన మేనకా గాంధీ సభను ఉద్దేశించి మాట్లాడారు.



Updated : 19 Sep 2023 7:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top