Home > జాతీయం > వారసత్వ, అవినీతి కూటములతో దేశానికి నష్టం : ప్రధాని మోడీ

వారసత్వ, అవినీతి కూటములతో దేశానికి నష్టం : ప్రధాని మోడీ

వారసత్వ, అవినీతి కూటములతో దేశానికి నష్టం : ప్రధాని మోడీ
X

ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్న ఆయన మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించిందన్న ఆయన.. మిత్ర పక్షాలు అన్ని రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయని చెప్పారు.

‘ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు అయిందని, ఈ సమయంలో దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందని మోడీ అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశాభివృద్ధి సాధ్యమన్న ఆయన.. ఈ నినాదంతోనే ఎన్డీఏ నిరంతరం ముందుకు సాగిందని గుర్తు చేశారు. ఎన్డీఏతో కలిసొచ్చిన ప్రతి పార్టీకి మోడీ కృతజ్ఞతలు చెప్పారు. ఆత్మనిర్భర్‌, అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యాల సాధనకు కృషి చేశామని చెప్పారు. ఎన్డీఏలోని ఎన్‌-న్యూ ఇండియా, డి-డెవలప్ నేషన్‌, ఎ-యాస్పిరేషన్‌ ఆఫ్‌ పీపుల్‌’ కు సంకేతమంటూ మోడీ కొత్త నిర్వచనం ఇచ్చారు. విపక్షాల కూటమి కొత్త పేరుపైనా మోడీ స్పందించారు. వారసత్వ, అవినీతి కూటములతో దేశం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు.

ఇదిలా ఉంటే ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు హాజరయ్యాయి. వాటిలో చాలా వరకు చిన్న చిన్న రాజకీయపార్టీలు ఉన్నాయి. కొన్ని పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ కూడా లేకపోవడం విశేషం.


Updated : 18 July 2023 10:11 PM IST
Tags:    
Next Story
Share it
Top