మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
X
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద యోగా నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. ఈ కార్యక్రమంలో అత్యధికంగా 140 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి మైఖేల్ ఎంప్రిక్.. ప్రధాని మోదీ, ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ క్సాబా కొరోసిలకు అవార్డును అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 9 ఏళ్ల క్రితం ఇక్కడే ప్రతిపాదించా. యావత్ ప్రపంచం దీనికి మద్దతు పలకడం సంతోషంగా ఉంది. యోగా ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందింది కాదు. దీనికి ఎలాంటి కాపీ రైట్స్, పేటెంట్, రాయల్టీలు లేవ’ని స్పష్టం చేశారు.
సూరత్ లో సరికొత్త రికార్డ్:
అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా.. గుజరాత్‌లోని సూరత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకేచోట 1.53లక్షల మందితో నిర్వహించిన యోగా సెషన్.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ రికార్డ్ అంతకముందు 2018లో రాజస్థాన్‌లోని కోటలో 1,00,984 మందితో నిర్వహించిన యోగా సెషన్ పై ఉంది.
In a remarkable achievement, Yoga enthusiasts from different parts of the world created a Guinness World Record at UN Headquarters today for the highest number of nationalities practising Yoga together.
— Amit Shah (@AmitShah) June 21, 2023
The feat achieved in the presence of PM @narendramodi Ji is a perfect ode to… https://t.co/8qDfDfCQs6