Home > జాతీయం > PNB SO Recruitment: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు

PNB SO Recruitment: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు

PNB SO Recruitment: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు
X

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 78 వేల వరకు జీతం అందుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక బెబ్ సైట్ ను https://www.pnbindia.in/ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటీ? వయోపరిమితి ఎంత? పోస్టుల వివరాలు? ముఖ్యమైన తేదీలు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంపిక ప్రక్రియ ఎలా? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మొత్తం పోస్టులు : 1025

పోస్టులు : క్రెడిట్ ఆఫీసర్(JMG స్కేల్-I) 1000 ఖాళీలు,

ఫారెక్స్ మేనేజర్ (MMG స్కేల్-II) 15 ఖాళీలు,

సైబర్ సెక్యూరిటీ మేనేజర్ (MMG స్కేల్-II) 5 ఖాళీలు,

సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ (MMG స్కేల్-III) 5 ఖాళీలు

అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

క్రెడిట్​ ఆఫీసర్​ పోస్టులకు సీఏ పాస్ అయి ఉండాలి. సీఎంఏ, సీఎఫ్​ఏ, ఎంబీఏ పాస్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60% మార్క్స్ ఉండాలి.

ఫారెక్స్​ మేనేజర్​ పోస్టులకు ఎంబీఏ, పోస్ట్​ గ్రాడ్యుయేట్​ డిప్లమా ఇన్​ మేనేజ్​మెంట్​ లేదా ఫైనాన్స్​, ఇంటర్నేషనల్​ బిజినెస్​లో సమానమైన అర్హత కలిగి ఉండాలి. 60% మార్కులు తప్పని సరి.

సైబర్​ సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు బీటెక్​ కంప్యూటర్​ సైన్స్​, ఐటీ, ఎలక్ట్రానిక్స్​, కమ్యూనికేషన్ విభాగాల్లో పాస్ అయి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుంచి కనీసం 60% మార్కులతో ఎంసీఏ ఉత్తీర్ణత చెందిన వారు ఈ పోస్టులకు అర్హులు

సైబర్​ సెక్యూరిటీ సీనియర్​ మేనేజర్ ఉద్యోగాలకు కంప్యూటర్​ సైన్స్​లో బీఈ, బీటెక్​ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంసీఏలో కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ, యూనివర్శిటి నుంచి కంప్యూటర్​ సైన్స్​లో ఎంటెక్​(ఫుల్​ టైమ్​) చేసి ఉండాలి.

వయస్సు పరిమితి: కనీసం 27-38 ఏండ్ల‌ మ‌ధ్య‌ ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ అభ్యర్థులకు ఫీజు: రూ.59. మిగిలిన అభ్యర్థులు రూ. 1180 ఆన్​లైన్​ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్ర‌వ‌రి 07

చివరి తేది: ఫిబ్ర‌వ‌రి 25

ఆన్​లైన్​ పరీక్ష నిర్వహించే తేదీ : 2024 మార్చి​ లేదా ఏప్రిల్

వెబ్‌సైట్ : pnbindia.in

Updated : 7 Feb 2024 3:19 PM IST
Tags:    
Next Story
Share it
Top