Home > జాతీయం > Farooq Nazki : ప్రముఖ కవి ఫరూక్ నజ్కీ కన్నుమూత

Farooq Nazki : ప్రముఖ కవి ఫరూక్ నజ్కీ కన్నుమూత

Farooq Nazki : ప్రముఖ కవి ఫరూక్ నజ్కీ కన్నుమూత
X

(Farooq Nazki) ప్రముఖ కవి ఫరూక్ నజ్కీ కన్నుమూశారు. కశ్మీర్లోని కత్రాలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1995లో ఆయన రాసిన నార్ హ్యుతున్ కంజల్ వానాస్ కవిత పుస్తకానికి కశ్మీర్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నజ్కీ ఆల్ ఇండియా రేడియో కాశ్మీర్, దూరదర్శన్‌లో వివిధ హోదాలలో పనిచేశారు. కశ్మీర్ సంస్కృతిని చాటిచెప్తూ గురించి నజ్కీ ఎన్నో కవితలు రాశారు. ఆయన కవితలు ప్రజలను లోతుగా ఆలోచించేలా చేయడంతోపాటు భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు సీఎంలు ఉన్నప్పుడు నజ్కీ మీడియా సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. బుధవారం శ్రీనగర్లో నజ్కీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఆయన మృతిపట్లు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Updated : 7 Feb 2024 12:13 PM IST
Tags:    
Next Story
Share it
Top