కరెంట్ కోసం ఆందోళన.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. మరో ఇద్దరికి..
X
బీహార్లోని కటిహార్ జిల్లాలో ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తకు దారితీసింది. కరెంట్ కోతలకు నిరసనగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ కాల్పులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కటిహార్ జిల్లాలోని బార్సోయి ప్రాంతంలో కరెంట్ కోతలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానిక విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఆఫీసుపైకి రాళ్లు విసిరి అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ కాల్పులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరెంట్ కోసం ఆందోళన చేస్తుంటే కాల్పులు చేయడం ఏంటని.. ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా కలెక్టర్ సహా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.