చెప్పినా వినలేదని.. లాయర్లపై లాఠీచార్జ్
X
ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్ లో లాయర్లపై పోలీసులు లాఠాచార్జ్ చేశారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ మహిళా న్యాయవాది తండ్రిపై పోలీసులు అక్రమ కేసు పెట్టగా.. దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని న్యాయవాదులు ధర్నాకు దిగారు. ధర్నాను ఉపసంహరించుకోవాలని పోలీసులు ఎంత చెప్పినా వినకపోయే సరికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి పోలీసులు లాయర్లపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి హింసాత్మకంగా మారింది.
మంగళవారం (ఆగస్ట్ 29) తహసీల్ చౌరస్తాలో న్యావాదులు నిరసనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద ఎత్తున రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి.. ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాయర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోయే సరికి వాగ్వాదం జరిగింది. పోలీసుల ఆరోపణ ప్రకారం లాయర్ల తరుపు నుంచి ఘర్షన ఎదురవడంతో లాఠా చార్జ్ చేయడం తప్పలేదని తెలిపారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, లాయర్లు గాయపడ్డారు.