Home > జాతీయం > ‘రిప్ హ్యుమానిటీ’.. ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న వాళ్లపై నీళ్లు పోసి..

‘రిప్ హ్యుమానిటీ’.. ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న వాళ్లపై నీళ్లు పోసి..

‘రిప్ హ్యుమానిటీ’.. ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న వాళ్లపై నీళ్లు పోసి..
X

పోలీసులు ఒక్కోసారి అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. సామాన్య ప్రజలపై జులుం చూపిస్తుంటారు. మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఓ ఘటనే పూణే రైల్వే స్టేషన్ లో జరిగింది. రైల్వే ప్లాట్ ఫామ్ పై నిద్రపోతున్న ప్రయాణికులపై బాటిల్ తో నీళ్లు పోసి, వాళ్లను వెళ్లగొడుతుంటాడు. అందులో ఓ ముసలాయన కూడా ఉన్నాడు. ఈ ఘటనంతా వీడియో తీసిన రూపేన్ చౌదరీ అనే వ్యక్తి.. తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దానికి ట్యాగ్ లైన్ జోడించి.. రిప్ హ్యుమానిటీ అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ఈ వీడియో రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ ఇందు దూబే.. దీనిపై స్పందించారు. ఇలా జరగడం ‘తీవ్ర విచారం’ అని చెప్పుకొచ్చారు. అయితే, ప్లాట్ ఫామ్ పై పడుకోవడం ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేసే విషయమే అయినా.. ఆ విషయంలో పోలీస్ వ్యవహరించిన తీరును ఆమె తప్పు బట్టారు. ప్రయాణికుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా చాలామంది మండిపడుతున్నారు. ఓ గవర్నమెంట్ అధికారి.. సామాన్యులపై ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటు, అమానుషం అని అభిప్రాయపడ్డారు.







Updated : 1 July 2023 11:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top