శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం
X
పరిస్థితులు ఎలా ఉన్నా భారతదేశం మాత్రం సూపర్ ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతోంది. అన్ని దేశాలు ఆర్ధిక మాంద్యంతో బాధపడుతుంటే భారత్ మాత్రం ఈ ఏడాది జీడీపీలో నంబర్ 1 గా నిలబడే అవకాశం ఉందని అంటున్నాయి పలు అంతర్జాతీయ సంస్థలు.
ఈ ఏడాది చివరకు భారత్ లో సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య పెరుగుతుందని అంచనా. అలాగే 2031 నాటికి పేదల సంఖ్య సగానికి పైగా తగ్గుతుందని పీపుల్స్ రీసెర్చి ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ అండ్ ఇండియాస్ సిటిజన్ ఎన్విరాన్ మెంట్ ఓ నివేదికలో తెలిపింది.భారత్ లో పేదలు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పింది. నెలకు రెండు లక్షల కంటే ఎక్కువ సంపాదించే కుటుంబాల సంఖ్య 2021 తర్వాత వేగంగా పెరుగుతోందని నివేదికలో రాసింది. గ్రామాల్లో ఇటువంటి కుటుంబాల వృద్ధి 14.2 శాతం, నగరాల్లో 10.6 శాతం ఉంటుందని పేర్కొంది.
25 రాష్ట్రాల్లో 40వేల మంది కంటే ఎక్కువ మందిని సర్వే చేసింది పీపుల్స్ రీసెర్చి ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ అండ్ ఇండియాస్ సిటిజన్ ఎన్విరాన్ మెంట్. గ్రామీణ ప్రాంతాల్లో ఎంటర్ ప్రెన్యువర్స్ ఎక్కువ అవుతున్నారని తెలిపింది. ఆర్ఇక వ్యవస్థను నడిపించే ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలను సృష్టిస్తున్నారుట వీళ్ళు. గ్లోబల్ మేనేజర్లు, విదేశీ బ్యాంకులు భారతదేశంలో పెరుగుతున్న మిలియనీర్లకు మారుతున్నాయని చెప్పింది. 20182022 మధ్య భారత్ లో ప్రతీరోజూ 70 మంది కొత్త మిలియనీర్లను తయారయ్యారని ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది.
పేద వాళ్ళు మిడిల్ క్లాస్ గా మారుతుంటే....మిడిల్ క్లాస్, ధనికులుగా మారుతున్నారు. లగ్జరీకార్లను కొనుగోలు చేయడంతో పాటూ విదేశాలకు తిరుగుతున్నారు. ఇండియా...ఆసియాలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా వేగంగా పెరుగుతోందని ఆక్స్ ఫామ్ నివేదికలో వెల్లడించింది. దేశంలో ఏడాదికి 6వేల నుంచి 36 వేల వరకు సంపాదిస్తున్న 43.2 కోట్ల మధ్య తరగతి వర్గం విస్తరిస్తుందని, ఇది 2031 నాటికి 71.5 మిలయన్లకు చేరుతుందని ఆక్స్ ఫామ్ అంచనా వేస్తోంది. అలాగే నిరుపేదలు కూడా 7.9 కోట్లలో సగాని కన్నా ఎక్కువగా తగ్గుతారని చెబుతోంది.