Home > జాతీయం > ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్ కలకలం.. వెతుకుతున్న ఢిల్లీ పోలీసులు

ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్ కలకలం.. వెతుకుతున్న ఢిల్లీ పోలీసులు

ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్ కలకలం.. వెతుకుతున్న ఢిల్లీ పోలీసులు
X

ప్రముఖ నటి, బీజేపీ నేత జయప్రద మిస్సింగ్ కలకలం రేపుతుంది. ఆమె కోసం ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో జయప్రద నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా జయప్రద లెక్కచేయలేదు. దీంతో ఆమెపై యూపీ, రాంపూర్ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా.. ఆమె కోర్టుకు హాజరు కాలేదు.

దీంతో ధర్మాసనం ఈ కేసు విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది. అప్పుడు జయప్రద కోర్టుకు రాలేదు. ఆపై డిసెంబర్‌ నెలలో హాజరు కావాలని కోర్టు హెచ్చరించినా.. ఆమె అందుబాటులోకి రాలేదు. దాంతో కోర్ట్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. జనవరి 10లోగా జయప్రదను కోర్ట్ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రాంపూర్ పోలీసులు ఆమెను వెతికే పనిలో పడ్డారు.



jayaprada,Tollywood,BJP,Rampur City,Movie News,cinema news,entertainment,actress jayaprada missing

Updated : 30 Dec 2023 5:47 PM IST
Tags:    
Next Story
Share it
Top