Home > జాతీయం > Business Idea : పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం..

Business Idea : పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం..

Business Idea : పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం..
X

సొంత ఊరిలో ఉంటూ తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుంది. అలాంటి వారి కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఓ బెస్ట్ బిజినెస్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. అదే పోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్. ఒక్కసారి రూ. 5 వేలు పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ. 50 నుంచి రూ. 80 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఈ బిజినెస్ కు ఎవరు అర్హులు..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఎంత ఆదాయం వస్తుంది..?

భారతీయ పౌరుల కోసం పోస్టాఫీసు పలు రకాల పథకాలను ఆఫర్ చేస్తోంది. పొదుపు చేయాలనుకునే వారి కోసం కూడా రకరకాల స్కీమ్స్ తీసుకువచ్చింది. పోస్టల్ డిపార్ట్మెంట్ స్కీముల్లో పెట్టుబడి పెడితే.. గ్యారెంటీ రిటర్న్స్ పొందొచ్చు. ఈ కారణంతోనే చాలా మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, ఇలా పొదుపు పథకాలు మాత్రమే కాదు.. సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే వారికి కూడా సరికొత్త అవకాశాలను కల్పిస్తోంది పోస్టల్ డిపార్ట్మెంట్. అదే ప్రోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ స్కీం.

పోస్టాఫీస్ ఫ్రాంఛైజీలో కేవలం స్టాంప్స్‌, ఇతర స్టేషనరీ విక్రయించాల్సి ఉంటుంది. అలానే రిజిస్టర్డ్‌ పోస్ట్, స్పీడ్‌ పోస్ట్‌, మనీ ఆర్డర్‌ సర్వీస్‌లను బుక్‌ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లులు, టాక్స్‌, జరిమానాలు, ఇతర చెల్లింపులతో పాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు కూడా అందించవచ్చు. ఈ బిజినెస్ ప్రారంభించేందుకు దాదాపు లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ముందుగా నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ కింద రూ.5000 పే చెయ్యాలి. ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 14 రోజుల్లోనే ఫ్రాంచైజీ పొందడానికి అర్హులా.. కాదా అనే విషయం తెలిసిపోతుంది.

అర్హతలు..

పోస్టాఫీసు ఫ్రాంచైజీకి అప్లై చేసే వారి వయసు 18 ఏండ్లు నిండి ఉండాలి.

భారతీయ పౌరుడై ఉండాలి.

కనీసం 8వ తరగతి పాసైన ఉండాలి.

పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు ఈ ఫ్రాంచైజీలు తీసుకునేందుకు అనర్హులు

ఆదాయం ఎలా…

పోస్టాఫీసుకు చెందిన సర్వీసులను అందిస్తూ వాటిపై వచ్చే కమీషన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్‌ మీద రూ. 3 కమీషన్ తీసుకోవచ్చు.

స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్పై రూ.5 కమిషన్ వస్తుంది.

మనీయార్డర్లకు అమౌంట్ ఆధారంగా కమీషన్ తీసుకోవచ్చు.

నెలవారీ టార్గెట్ కింద 1000 రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ బుకింగ్స్ చేసినట్లయితే అదనంగా 20 శాతం కమీషన్ ఇస్తారు.

పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా 5 శాతం కమీషన్ పొందొచ్చు.




Updated : 30 Dec 2023 3:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top