తేజస్లో విహరించిన మోదీ.. ప్రకాష్ రాజ్ సెటైర్లు
X
ప్రకాష్ రాజ్.. బీజేపీ అంటేనే భగ్గుమంటాడు. బీజేపీ విధానాలను, ప్రధాని మోదీని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాడు. జస్ట్ ఆస్కింగ్ అనే యాష్ ట్యాగ్తో ఆయన మోదీ సహా బీజేపీపై సెటైర్లు వేస్తుంటారు. తాజాగా ప్రధాని మోదీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మోదీ ఇవాళ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. బెంగళూరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను సందర్శించడానికి వెళ్లిన ప్రధాని.. అక్కడ స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన తేజస్ యుద్ధవిమానంలో విహరించారు.
మోదీ తేజస్లో ప్రయాణించడంపై స్పందించిన ప్రకాష్ రాజ్.. నెక్ట్స్ ఏంటి... జలాంతర్గామిలో ప్రయాణించడమేనా? అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనికి మోదీ తేజస్లో ప్రయాణించిన ఫొటోలను జత చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇక యూఎఫ్ఓలో ప్రయాణించడమే మిగిలుంది అని ఒకరు కామెంట్ చేయగా..మరికొందరు ప్రకాశ్ రాజ్పై నమోదైన ఈడీ కేసును ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు. ః
What next … Submarine ??? #justasking pic.twitter.com/HbUB6CWZYd
— Prakash Raj (@prakashraaj) November 25, 2023