Home > జాతీయం > Pratibha Singh : హిమాచల్ప్రదేశ్ సీఎం రేసులో ప్రతిభా సింగ్.. ఇంతకీ ఎవరీవిడ?

Pratibha Singh : హిమాచల్ప్రదేశ్ సీఎం రేసులో ప్రతిభా సింగ్.. ఇంతకీ ఎవరీవిడ?

Pratibha Singh : హిమాచల్ప్రదేశ్ సీఎం రేసులో ప్రతిభా సింగ్.. ఇంతకీ ఎవరీవిడ?
X

హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతోన్నాయి. అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. రాజ్యసభలో ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా మలుపుతిరిగాయి. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. సీఎం మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సుఖ్విందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం సీఎల్పీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. కాగా సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత ప్రతిభా సింగ్ పేరు వినిపిస్తోంది. ఈవిడ దివంగత వీరభద్ర సింగ్ భార్య. ఆయన ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. ప్రతిభా సింగ్ 1998 నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఆ సమయంలోనే మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయారు.





ఆ తర్వాత 2004 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. 2012లో వీరభద్ర సింగ్ సీఎం అయ్యాక.. ఆయన లోక్ సభకు రాజీనామా చేశారు. దీంతో 2013లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన ప్రతిభా సింగ్.. బీజేపీ అభ్యర్థి జైరామ్ ఠాకూర్ ను ఓడించారు. 2014లో మళ్లీ ఓడిపోయారు. బీజేపీ నేత స్వరూప్ శర్మ 39వేల ఓట్ల తేడాతో ఆమెను ఓడించారు. ఆ ఓటమితో నేతలంతా కంగుతిన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ 2021లో ఆమె విజయం సాధించారు. కాగా 2022లో కాంగ్రెస్ అధిష్టానం ప్రతిభా సింగ్ ను హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించింది.




Updated : 28 Feb 2024 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top