Home > జాతీయం > Pre Wedding Shoot : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. డాక్టర్ సస్పెండ్

Pre Wedding Shoot : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. డాక్టర్ సస్పెండ్

Pre Wedding Shoot : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. డాక్టర్ సస్పెండ్
X

పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అందుకే మిగతా సంగతులన్నీ ఎలా ఉన్నా పెళ్లి విషయంలో మాత్రం ఎవరూ వెనక్క తగ్గడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్(Pre Wedding Shoot) షూట్ కామన్ అయిపోయింది. కొందరు తమ పార్ట్నర్ తో స్వీట్ ముమెంట్స్ ను దాచుకోడానికి ఫోటోలు దిగుతుంటే..మరి కొందరు పాపులారిటీ కోసం పిచ్చి వేషాలు వేస్తున్నారు. డిఫరెంట్గా ట్రై చేస్తూ ప్రీవెడ్డింగ్ షూట్ అనే పదాన్నే మర్చేస్తున్నారు. అలాంటి వింత సంఘటన ప్రస్తుతం కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ జంట చేసిన ప్రీ వెడ్డింగ్ ని చూస్తే..ఎవరైనా సరే పిచ్చి పీక్స్ కి వెళ్లింది అనాల్సిందే.

గౌవర్నమెంట్ హాస్పిటల్ లో పని చేసే ఓ డాక్టర్ తన ప్రీవెడ్డింగ్ షూట్ ను వెరైటీగా ప్లాన్ చేశాడు. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే ఫొటో షూట్ ను ఏర్పాటు చేశాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తిధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీవెడ్డింగ్‌ షూట్‌ (Pre Wedding Shoot) ఏర్పాటు చేశాడు. చిత్రదుర్గ జిల్లాలోని ఆసుపత్రిలో ఈ వింత సంఘటన జరిగింది.

పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్‌ల పేరిట కొత్త ట్రెండ్‌ మొదలైంది. దీంతో ప్రస్తుత జంటలు మారుతున్న కాలానికి తగ్గట్టు వెరైటీగా ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యాడు కర్ణాటకకు చెందిన యువ వైద్యుడు. భరంసాగర్‌ ఏరియాలోని గౌర్నమెంట్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ డాక్టర్ గా పని చేస్తున్న అతడు..ఆపరేషన్‌ థియేటర్‌ నే అందుకు వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇంకేముంది తన పార్ట్నర్ తో కలిసి ఓ రోగికి సర్జరీ చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. ఇది వైద్యవర్గాల్లో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రభుత్వం ఆ డాక్టర్ ని వెంటనే సస్పెండ్ చేసింది.

ఈ అంశంపై కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేశ్‌ గుండు రావ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేసిన సదరు డాక్టర్ ని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. హాస్పిటల్స్ పెట్టింది

ప్రజలకు వైద్యాన్ని అందించడానికి మాత్రమే అని స్పష్టం చేశారు. అంతేగాని వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదని తెలిపారు. డాక్టర్లు తమ వృత్తిని మరచి క్రమశిక్షణ దాటితే సహించేది లేదన్నారు. హెల్త్‌ కేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, సిబ్బంది తమ సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హెచ్చరించారు. గౌర్నమెంట్ హాస్పిటల్స్ లో పని చేసే ప్రతి ఒక్కరు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేగాక, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా నడుచుకోవాలని మంత్రి దినేశ్ చెప్పారు.





Updated : 10 Feb 2024 7:39 AM IST
Tags:    
Next Story
Share it
Top