Home > జాతీయం > Droupadi Murmu : సాయంత్రం హైదరాబాద్కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు..

Droupadi Murmu : సాయంత్రం హైదరాబాద్కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు..

Droupadi Murmu  : సాయంత్రం హైదరాబాద్కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు..
X

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. సాయంత్రం 6.25కు హకీంపేట ఎయిర్ ఫోర్స్ సెంటర్కు చేరుకుంటారు. అక్కడ రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రెసిడెంట్ ఈ నెల 23వరకు ఇక్కడే ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.

ఈ నెల 20న రాష్ట్రపతి ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే చేనేత ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ రూట్లలో వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు వేరే మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


Updated : 18 Dec 2023 12:08 PM IST
Tags:    
Next Story
Share it
Top