Home > జాతీయం > టమాట ధర తగ్గేది అప్పుడే..

టమాట ధర తగ్గేది అప్పుడే..

టమాట ధర తగ్గేది అప్పుడే..
X

సెంచరీ దాటిన కూరగాయ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. పోను పోను ధరలు మరింత పెరుగుతున్నాయే కానీ ఎక్కడా కూడా తగ్గినట్లు కనిపించడం లేదు. ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం పెరిగిన ధరలపై స్పందించింది. ఈ పరిస్థితి మరో 20 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందని అంచనా వేస్తోంది.

దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర కూరగాయల ధరలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ స్పందించారు. ధరల పెరుగుదలకు కారణాలను ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. " మరో పది , పదిహేను రోజుల్లో పెరిగిన ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. టమాట తాజా లోడ్‌లు విభిన్న ప్రాంతాలకు చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది.మరో రెండు మూడు వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ధరలు కచ్చితంగా దిగివస్తాయి. ప్రతీ సంవత్సరం ఈ టైంకి టమాట ధర సాధారణంగానే పెరుగుతుంది. కానీ, ఈసారి పరిస్థితి ఘోరంగా ఉంది. వాతావరణంలో మార్పులతో పాటు సరఫరాపై ఉన్న పరిమితుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతింది. టమాటానే కాదు చాలా వరకు కూరగాయల ధరల పెరుగుదలలో ఇదే జరుగుతోంది. ఈ సమయంలో ధరల నియంత్రణకు రాష్ట్రా ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగు చర్యలు తీసుకోవాలి"అని రోహిత్ కుమార్ సూచించారు.





Updated : 28 Jun 2023 10:31 AM IST
Tags:    
Next Story
Share it
Top