Home > జాతీయం > 17 సెకన్లలో కొలాప్స్..కళ్లముందే స్కూల్ కొట్టుకుపోయింది

17 సెకన్లలో కొలాప్స్..కళ్లముందే స్కూల్ కొట్టుకుపోయింది

17 సెకన్లలో  కొలాప్స్..కళ్లముందే స్కూల్ కొట్టుకుపోయింది
X

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి . యూపీతో సహా పలు రాష్ట్రాల్లు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కూడా ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్​ఖేరీలోని శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శారదా నది తీరాన ఉన్న గ్రామాలు నది ఉగ్రరూపానికి తల్లడిల్లుతున్నాయి. ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో లఖింపూర్ ఖేరీ జిల్లా ఫూల్‌బెహార్ బ్లాక్‌లోని అహిరానా గ్రామంలోని ఓ ప్రైమరీ స్కూల్ భవనం గురువారం ఒక్కసారిగా నదిలోకి కొట్టుకుపోయింది. అందరూ చూస్తుండగా కేవలం 17 సెకన్ల వ్యవధితలో స్కూల్ నదితో పాటే కొట్టుకుపోయింది. స్కూల్‎తో పాటే గ్రామంలోని కొన్ని ఇళ్లు ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక నదిలోకి కొట్టుకుపోయాయి.

నేపాల్‌లోని కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా వరుణుడు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్‎గా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో వరద నీరుతో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కేవలం 7 రోజుల్లోనే పదికిపైగా ఇళ్లు, గుడిసెలు, వేల ఎకరాల పంట భూములు వర్షార్పణమయ్యాయి. పరిస్థితిని గమనించిన అధికారులు గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. శరదా నది ఉధృతి వల్ల గత ఐదేళ్లలో సుమారు 200 ఇళ్లు నదిలో కొట్టుకుపోయాయని సమాచారం. ప్రస్తుతం నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.



Updated : 14 July 2023 12:01 PM IST
Tags:    
Next Story
Share it
Top