యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
X
ప్రధాని నరేంద్ర మోదీ ఓ అరుదైన రికార్డును సృష్టించారు. తన యూట్యూబ్ ఛానెల్లో (నరేంద్ర మోదీ) 2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లను పొందిన ఆయన.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి నేతగా చరిత్రలో నిలిచారు. ఈ జాబితాలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో రెండో స్థానంలో (64 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ మూడో స్థానంలో (22.4 లక్షల సబ్‌స్క్రైబర్లు) ఉన్నారు. తర్వాత స్థానంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (7.89 లక్షల సబ్‌స్క్రైబర్లు), టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయిప్ ఎర్డగోన్‌కు (3.16 లక్షల సబ్‌స్క్రైబర్లు) ఉన్నారు. మోదీ ఒక్కరే 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు కలిగిని దేశాధినేతగా నిలిచారు.
దీంతో మోదీకి అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, లైవ్ కార్యక్రమాలను పోస్ట్ చేస్తుంటారు. ఆ వీడియోలను సుమారు 450 కోట్ల మంది ఇప్పటికే చూడగా.. దేశాధినేతల్లో ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోలేరు. యోగా విత్ మోదీ అనే యూట్యూబ్ ఛానల్ కు కూడా ఫుల్ క్రేజీ ఉంది. ఆ ఛానల్‌కు 73 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2007లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ తన యూట్యూబ్ చానెల్ ను క్రియేట్ చేసుకున్నారు.