Home > జాతీయం > సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ

సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ

సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ
X

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్‌లోని ద్వారకలో 2.3 కిలోమీటర్ల పొడవున్న వంతెనకు సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో కలుపుతుంది. ద్వారకాదీశ్‌ ఆలయాన్ని చూడడానికి వచ్చే టూరిస్ట్ లకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించారు. 2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌ కూడా ఉంది. అంతేగాక బ్రిడ్జికి రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుని ఫొటోలు ఏర్పాటు చేశారు. అంతేగాక బ్రిడ్జి పై పలు చోట్ల సోలార్ ప్యానెళ్ల ద్వారా మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఇక్కడి బెట్‌ ద్వారకా ద్వీపంలోని ద్వారకాదీశ్‌ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అటు ఇదేకాక గుజరాత్‌ (రాజ్‌కోట్‌), ఆంధ్రప్రదేశ్‌ (మంగళగిరి), పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.6,300 కోట్లు మంజూరు చేసింది.

Updated : 25 Feb 2024 6:24 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top