Home > జాతీయం > బాలసోర్‎కు ప్రధాని మోదీ.. రైలు ప్రమాదస్థలి పరిశీలన

బాలసోర్‎కు ప్రధాని మోదీ.. రైలు ప్రమాదస్థలి పరిశీలన

బాలసోర్‎కు ప్రధాని మోదీ.. రైలు ప్రమాదస్థలి పరిశీలన
X

ఒడిశాలో రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. బాలేశ్వర్ జిల్లాలోని జరిగి ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందగా..వేయి మంది గాయపడ్డారు.క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.స్వయంగా బాలాసోర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. రైలు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మోదీకి ప్రమాదంపై ప్రాథమిక కారణాలను కేంద్రమంత్రులు వివరించారు. అనంతరం ఆస్పత్రిలో క్షతగాత్రులను మోదీ పరామర్శించారు.

విదేశాలు స్పందన

రైలు ప్రమాదంపై విదేశాలు విచారం వ్యక్తం చేశాయి. వందలాది మంద్రి ప్రాణాలు కోల్పోవడంపై పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్..సంతాపం ప్రకటించారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని ప్రకటించారు.

ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. తైవాన్‌ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్‌ వెన్‌ కూడా మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు రష్యా అంబాసిడర్‌ డెనిస్‌ అలిపొవ్‌‌లు సంతాప సందేశాలు పంపారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.


Updated : 3 Jun 2023 11:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top