MODI : నేడు హైదరాబాద్కు మోదీ.. ఉండేది 2 గంటలే!
X
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈ సభలో మోదీ బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంరది. రానున్న అసెంబ్లో ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే వెనకబడిన తరగతుల వ్యక్తిని సీఎం చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తుంది. అలాగే తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను ఆకట్టుకునేలా బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక, గత పర్యటనలో కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడిన మోదీ ఇవాళ ఏం మాట్లాడనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
హైదారబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ సభ కేవలం గంటన్నర సమయంలోనే ముగియనుంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ రానున్న మోదీ సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టులో దిగుతారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుని.. 6.10 గంటల వరకు బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తర్వాత 6.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.