Home > జాతీయం > మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ

మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ

మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ
X

ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వెళ్లేందుకు మెట్రోను ఆశ్రయించారు. ఓ సాధారణ ప్రయాణికుడి మాదిరి ప్రధాని మెట్రోలో ప్రయాణం చేశారు. ఈ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించారు. బోగీలో ఎక్కిన విద్యార్ధులతో మాట్లాడారు. వారి కెరీర్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. మోదీ ఇచ్చిన సూచనలను ఆసక్తిగా విన్నారు. మోదీ మెట్రోలో ప్రయాణించిన ఫోటోలు ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.

ఢిల్లీ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సహచరులతో కలిసి మాట్లాడుతూ రావడం బాగుందన్నారు. "ఇద్దరు స్నేహితులు ప్రతి ఒక్క అంశంపై చర్చిస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి చంద్రుడి వరకు మాట్లాడుకుంటున్నారు. ఏ సినిమా చూశావు, ఫలానా సిరీస్ ను ఓటీటీలో చూడొచ్చా, ఇన్ స్టా గ్రామ్ రీల్ ట్రెండ్ చూశావా? అని మాట్లాడుకుంటున్నారు. యువకులతో మాట్లాడడం సరదాగా ఉంది" అని ప్రధాని తెలిపారు.





Updated : 30 Jun 2023 3:16 PM IST
Tags:    
Next Story
Share it
Top