Home > జాతీయం > MODI : షోలాపూర్‌ సభలో కన్నీటిపర్యంతమైన ప్రధాని

MODI : షోలాపూర్‌ సభలో కన్నీటిపర్యంతమైన ప్రధాని

MODI : షోలాపూర్‌ సభలో కన్నీటిపర్యంతమైన ప్రధాని
X

ప్రధాని మోదీ తన బాల్యం రోజులను గుర్త చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పీఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ప్రధాని అందజేశారు. తన చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తోందని అన్నారు. కన్నీళ్లను దిగమింగుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు. 2014లో తాను ఇచ్చిన హామీ నెరవేరడం సంతోషదాయకమని చెప్పారు. ఈ ఇళ్లను చూడగానే తనకు తన బాల్యం గుర్తొచ్చిందని అన్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మన సంప్రదాయలు, కట్టుబాట్లను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని.. ఆయన నిజాయతీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని చెప్పారు. రాముడి బాటలో నడుస్తూ.. పేదల సంక్షేమం, వారి సాధికారిత కోసం పని చేస్తున్నామని అన్నారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనేదే తమ కోరిక అని చెప్పారు. పేదల సంక్షేమం,వారి సాధికారత కోసం మేము పని చేస్తున్నాం "అని ప్రధాని అన్నారు. జనవరి 22న అయోధ్యను సందర్శించవద్దని,దానికి బదులుగా దీపావళి రోజున తమ ఇంట్లో దీపం వెలిగించి 'ప్రాణ ప్రతిష్ట' జరుపుకోవాలన్నారు.




Updated : 20 Jan 2024 6:44 AM IST
Tags:    
Next Story
Share it
Top