Home > జాతీయం > దేశంలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నెల్..ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశంలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నెల్..ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశంలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నెల్..ప్రారంభించనున్న ప్రధాని మోదీ
X

ఇండియాలో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా కోల్‌కత్తాలో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది గర్భంలో నిర్మించారు. కోల్‌కత్తా ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ వాటర్ టన్నెల్ ను నిర్మించారు.

మెట్రో టన్నెల్ విశేషాలివే..

కోల్ కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలో మీటర్లు ఉండగా...ఇందులో 10.8 కిలో మీటర్లు భూగర్భంలో ఉంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కిలో మీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు ద్వారా వెళ్లాలంటే 90 నిమిషాలు పడుతుంది. అయితే ఈ టన్నెల్ ద్వారా ప్రయాణం 40 నిమిషాలకు తగ్గనుంది. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా మెట్రో నడుస్తుంది. ఈ మెట్రో రైలు కారిడార్ పరిధిలో ఆరు స్టేషన్లు కలిగి ఉంటుంది. అయితే, మూడింటిని వాటర్ లోపలే కట్టారు. అయితే మెట్రో సేవలకు అంతరాయం కలగడం మనం చూస్తుంటాం. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనేమి లేదన్నారు అధికారులు. ఒకవేళ మెట్రో ట్రైన్ లో సమస్య తలెత్తి మధ్యలో ఆగిపోయినా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వాడుకోవచ్చు. ప్రతీరోజూ కనీసం 5 లక్షల మంది ప్రయాణీకులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రపంచంలో అనేక దేశాల్లో అండర్ వాటర్ రైల్వే ప్రయాణ సదుపాయం ఉంది. అయితే మన దేశంలో ఇదే తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్.

Updated : 6 March 2024 3:04 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top