Home > జాతీయం > ప్రధాని మోదీ ఉమన్స్ డే కానుక...గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

ప్రధాని మోదీ ఉమన్స్ డే కానుక...గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

ప్రధాని మోదీ ఉమన్స్ డే కానుక...గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
X

ప్రధాని మోదీ ఉమన్స్ డే కానుక అందించారు. మహిళ దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. వంటగ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ట్వీటర్ వేదికగా తెలిపారు. LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గిస్తున్నామన్నారు. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని చెప్పారు. మరీ ముఖ్యంగా నారీ శక్తికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబాల శ్రేయస్సుకు మద్దతూ ఇవ్వడం, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇది నారీమణులకు సాధికారత కల్పించేందుకు సహాయపడుతుందని, ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందిస్తుందని మోదీ అన్నారు.

Updated : 8 March 2024 3:40 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top