Home > జాతీయం > మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ నైల్'..

మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ నైల్'..

మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ నైల్..
X

ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. అమెరికా పర్యటన అనంతరం ఆయన ప్రస్తుతం ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఈజిప్టులో పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌' మోదీ అందుకున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌-సిసి ఈ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. ఈ అవార్డును తనకు అందించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈజిప్టు చేరుకున్న మోదీకి ఈజిప్టు ప్రధాని మోస్తఫా మద్‌బౌలీ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఈజిప్టు సేనల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు కామన్‌వెల్త్ వార్ గ్రేవ్ సిమిట్రీలో నిర్మించిన స్మారకాన్ని మోదీ సందర్శించి, నివాళులర్పించారు.

ఈజిప్టులో పురాతన మసీదును మోదీ సందర్శించారు. మతపెద్దలతో కలిసి అల్‌- హకీం- మసీదు మొత్తం తిరిగి ప్రార్థనా మందిరం గోడలు, తలుపులపై చెక్కిన శాసనాలను పరిశీలించారు. భారత్, ఈజిప్టు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ మసీదు నిలుస్తుంది. గత ఏడాది గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరైన అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటిస్తుండటం ఇది మొదటిసారి.



Updated : 25 Jun 2023 10:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top