Home > జాతీయం > MODI : 10 సీట్లు టార్గెట్.. త్వరలో రాష్ట్రానికి మోడీ

MODI : 10 సీట్లు టార్గెట్.. త్వరలో రాష్ట్రానికి మోడీ

MODI  : 10 సీట్లు టార్గెట్.. త్వరలో రాష్ట్రానికి మోడీ
X

లోక్ సభ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసేందుకు బీజేపీ సకల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా ఎంపీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ నాయకత్వం నిర్దేశించిన 10 ఎంపీ, 35 శాతం ఓట్ల సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఈ నెలాఖరుకు ప్రధాని మోడీ అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రానున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ తరఫున సభలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం కల్లా పార్లమెంట్ ఎన్నికలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించి ప్రజా క్షేత్రంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుతో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్య దర్శులు నలుగురిని ఈ క్లస్టర్లకు ఇన్‌చార్జిలుగా నియమించారు.

వచ్చే నెల 5 తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ ఐదు క్లస్టర్లలో బీజేపీ ఎన్నికల రథయాత్రలను నిర్వహించనున్నారు.ఈ నెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్‌ లోక్‌సభ క్లస్టర్‌ పరిధిలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ క్లస్టర్‌ పరిధిలో ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో కూడా పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు.పార్లమెంట్‌ నియెజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన తెలంగాణ బిజెపి నాయకత్వం 8 మంది ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఎన్నికల సమన్వయయం కోసం పార్లమెంట్‌ కన్వీనర్లతో పాటు ఆర్గనైజేషన్‌ ఇంఛార్జీలను నియమించాలని యోచిస్తోంది. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర పదాధికారుల్లో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. 15 నుంచి 20 జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు జిల్లా అధ్యక్షులను మార్చారు.




Updated : 20 Jan 2024 3:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top