Home > జాతీయం > మమ్మల్ని చెప్పొద్దన్నారు.. వాళ్లే బయటపెట్టారు - బజరంగ్ పునియా

మమ్మల్ని చెప్పొద్దన్నారు.. వాళ్లే బయటపెట్టారు - బజరంగ్ పునియా

మమ్మల్ని చెప్పొద్దన్నారు.. వాళ్లే బయటపెట్టారు - బజరంగ్ పునియా
X

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం కొనసాగుతోంది. ఆందోళనలో పాల్గొంటున్న మల్లయోధుడు బజరంగ్ పునియా తాజాగా సంచలన విషయం బయట పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రెజ్లర్లు జరిపిన చర్చల గురించి ఆయన తొలిసారి పెదవి విప్పారు. అమిత్‌ షాతో సమావేశం గురించి ఎవరికీ చెప్పవద్దని ప్రభుత్వం రెజ్లర్లను కోరిందని, అయితే తమంత తాముగా ప్రభుత్వమే ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేసిందని బజరంగ్ పునియా వాపోయారు. రెజ్లర్ల వివాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని హోం మంత్రి రెజ్లర్లకు చెప్పారని అన్నారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని తాము తేల్చి చెప్పినట్లు పునియా స్పష్టం చేశారు.

తమ ఆందోళన విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని బజ్రంగ్ పునియా అన్నారు. తమ డిమాండ్లను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వాపోయారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయకుండా ఎందుకు కాపాడుతున్నారని అమిత్ షాను ప్రశ్నించగా.. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చినట్లు పునియా చెప్పారు.

రెజ్లర్లలో కొందరు ఉద్యోగాల్లో చేరడంపైనా బజ్రంగ్ పునియా స్పందించారు. విధుల్లో చేరినంత మాత్రాన పోరాటం బలహీనపడదని అన్నారు. నిరసనలో పాల్గొంటున్న వారంతా ఉద్యోగాలకు సెలవు పెట్టారని అయితే జంతర్ మంతర్ నుంచి తమను ఖాళీ చేయించడంతో తమలో కొందరు విధుల్లో చేరినట్లు ఒకరోజు రిపోర్ట్ చేశామని స్పష్టం చేశారు. ఒకవేళ తమ ఆందోళనలకు ప్రభుత్వ ఉద్యోగాలే అడ్డంకి అయితే వాటిని వదులుకునేందుకు సైతం సిద్ధమని పునియా తేల్చిచెప్పారు.

Updated : 6 Jun 2023 5:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top