Home > జాతీయం > కుక్క కాటు కేసులపై పంజాబ్ - హర్యానా హైకోర్టు సంచలన తీర్పు

కుక్క కాటు కేసులపై పంజాబ్ - హర్యానా హైకోర్టు సంచలన తీర్పు

కుక్క కాటు కేసులపై పంజాబ్ - హర్యానా హైకోర్టు సంచలన తీర్పు
X

కుక్క కాటు కేసులకు సంబంధించి పంజాబ్ - హర్యానా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇలాంటి ఘటనకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల కాటు కేసులో బాధితులకు అయ్యే ఒక్కో పంటి గాటుకు ప్రభుత్వం రూ. 10వేల పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ కుక్కల దాడిలో 0.2 సెంటీమీటర్ల గాయమయితే బాధితునికి రూ. 20వేలు చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటుకు సంబంధించి 193 పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.

వీధి కుక్కల దాడిలో ఈ ఏడాది అక్టోబర్లో వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ చనిపోయారు. వీధికుక్కలు ఆయనపైకి రావడంతో కింద పడిపోయిన పరాగ్.. తీవ్ర రక్తస్రావం కారణంగా కన్నుమూశారు. ఈ ఘటన అనంతరం వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ క్రమంలోనే పంజాబ్ - హర్యానా హైకోర్టు తీర్పు వెలువరించింది.

పంజాబ్, హర్యానాతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.




Updated : 14 Nov 2023 6:39 PM IST
Tags:    
Next Story
Share it
Top