నాకేం భయం లేదు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరం లేదు : పంజాబ్ సీఎం భగవంత్ మాన్
X
కేంద్రం కేటాయించిన జడ్ ప్లస్ సెక్యూరిటీని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తిరస్కరించారు. కేంద్రం ఆఫర్ వద్దని.. తన రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఉందని అన్నారు. పంజాబ్, ఢిల్లీల్లో తనకు పోలీసులు రక్షణగా ఉంటారని.. ఎలాంటి జడ్ ప్లస్ సెక్యూరిటీ తనకు అవసరం లేదని చెప్పుకొచ్చారు. సెక్యూరిటీ పరంగా 55 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తారు.
ఇటీవల ఖలిస్థాన్ వేర్పాటువాదుడు.. ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు వల్ల నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. భగవంత్ మాన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించాలని సూచించారు. దీంతో కేంద్రం ప్రత్యేక సెక్యూరిటీని ప్రకటించింది. ఈ విషయంపై భగవంత్ మాన్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. రెండు రాకల సెక్యూరిటీల వల్ల గందరగోళం ఏర్పడుతుందని.. తనకు పోలీసులపై నమ్మకం ఉందని.. కాకపోతే.. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సెక్యూరిటీని అందించాలని లేఖలో పేర్కొన్నారు.