వాళ్ళిద్దరినీ వరదలే కలిపాయి
X
వరదల వల్ల నష్టపోతారని అందరికీ తెలుసు. ఆప్తులను పోగొట్టుకుంటారు. కానీ అవే వరదలు తల్లీకొడుకులను కలిపాయి. 35 ఏళ్ళ క్రితం దూరమైన కొడుకును తల్లి ఒడికి చేర్చాయి. వరదలు తెచ్చిన ఈ ఆనందాలకు తల్లీకొడుకులు వాటిలాగే ఉప్పొంగిపోతున్నారు.
జగజీత్ సింగ్ పటియాలాలోని బోహరర్ పూర్ గ్రామంలో వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చాడు. అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఈ కార్యక్రమాల్లోనే అతని తల్లి హర్జీత్ కౌర్ ను కలుసుకున్నాడు. సుమారు రెండేళ్ళ వయసున్నప్పుడు తల్లి నుంచి విడిపోయిన జగజీత్ సింగ్ మళ్ళీ 35 ఏళ్ళ తర్వాత తల్లిని చేరాడు. జగజీత్ కు 6 నెలల వయసున్నప్పుడు అతని తండ్రి చనిపోయాడు. తర్వాత అతని తల్లి రెండో పెళ్ళి చేసుకుంది. మరో రెండేళ్ళకు జగజీత్ ను అతని తాత, నాయన్నమ్మలు వారుంటున్న ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు జగజీత్ ను అతని తల్లితో కలవకుండా చేశారు. అతను ఎక్కుడున్నాడో కూడా తల్లికి చెప్పలేదు. తల్లిదండ్రులు చనిపోయారని అతనికి చెప్పారు. అదే నిజమనుకున్న జగజీత్ అలాగే పెరిగాడు.
తన తల్లి బతికుందనే విషయమే తనకు తెలియదని అంటున్నాడు జగజీత్ సింగ్. పంజాబ్ లోని పటియాలాలోని ప్రాంతాలను వరద ముంచెత్తింది. జూలై 19న పటియాలాలో ఉన్నాను. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాను. అప్పుడే మా అత్త దగ్గర నుంచి నాకు కాల్ వచ్చిందని చెబుతున్నాడు. మా అమ్మమ్మ, తాత బోహర్ పూర్ గ్రామంలో ఉందని ఆమే తెలిపింది. అప్పుడు నేను అక్కడికి చేరుకుని వాళ్ళను కలుసుకున్నాను. అలా మా అమ్మ హర్ జీత్ కౌర్ గురించి తెలిసింది. నేను తనకు మొదటి భర్త వల్ల కుమారుడిని అన్న విషయమూ అప్పుడే తెలిసింది. దాంతో నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఇన్నేళ్ళు తల్లి ఉన్నా లేకుండా బతికిన దురదృష్టవంతుడినా అనుకున్నాు అని చెబుతున్నాడు జగజీత్ సింగ్.
ఇప్పటికైనా భగవంతుడు నన్ను నా తల్లి దగ్గరకు చేర్చాడు. మా ఇద్దరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు. మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ కుటుంబాల మధ్య ఏవో మనస్పర్ధులు ఉన్నాయి. దాని కారణంగానే తాను ఇన్నేళ్ళు తల్లికి దూరంగా ఉండవలసి వచ్చిందని వివరించాడు.