గవర్నర్ సంచలన నిర్ణయం.. రాష్ట్రపతికి రాజీనామా లేఖ
X
పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ‘‘నా వ్యక్తిగత కారణాలతో పాటు కొన్ని కమిట్మెంట్ల వల్ల పంజాబ్ గవర్నర్, చంఢీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి’’ అని రాష్ట్రపతికి రాజీనామా లేఖ రాశారు. కాగా గత కొన్నాళ్లుగా ఆప్ సర్కార్ - గవర్నర్ మధ్య విభేధాలు నెలకొన్నాయి. పెండింగ్ బిల్లుల విషయంలో భగవంత్ మాన్ సర్కార్ గవర్నర్ తీరును నిరసిస్తూ సుప్రీం కోర్టు తలపుతట్టింది.
అదేవిధంగా ఇటీవలే చండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ దక్కించుకుంది. అయితే దీనిపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే భన్వరిలాల్ రాజీనామా చేయడం గమనార్హం. భన్వరిలాల్ అంతకుముందు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. గతంలో ఆయన నాగపూర్ ఎంపీగా మూడు సార్లు ఎన్నికయ్యారు.