Home > జాతీయం > పోలీసును కొట్టిచంపిన కబడ్డీ ప్లేయర్లు.. 2 కోట్ల పరిహారం

పోలీసును కొట్టిచంపిన కబడ్డీ ప్లేయర్లు.. 2 కోట్ల పరిహారం

పోలీసును కొట్టిచంపిన కబడ్డీ ప్లేయర్లు.. 2 కోట్ల పరిహారం
X

ఓ రెస్టారెంట్‌లో జరుగుతున్న గొడవను ఆపడానికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. కబడ్డీ ఆటగాళ్లు అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పంజాబ్‌లోని బర్నాలా జిల్లా ఠాణా పట్టణంలో ఆదివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. ‘22 ఎకర్ మార్కెట్’ రెస్టారెంటులో కొందరు కబడ్డీ ప్లేయర్లు యజమానితో, సిబ్బందితో బిల్లు విషయంపై గొడవకు దిగారు. మాటా మాటా పెరిగి దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు దర్శన్ సింగ్ (50) అనే పోలీసుతోపాటు మరో పోలీసులు అక్కడికి పంపారు. పోలీసులు వివాదం గురించి తెలుసుకుని ఆటగాళ్లను తమ వాహనం ఎక్కమని ఆదేశించారు. దీంతో ఆటగాళ్లు రెచ్చిపోయి దర్శన్‌పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన దర్శన్‌ను అతనితోపాటు వచ్చిన పోలీసులు దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించాడు. దర్శన్ అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎనిమిదిమంది దాడిలో పాల్గొన్నారని వారిలో నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. పోలీస్ హత్యపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రూ. 2 కోట్ల పరిహరం ప్రకటించారు.


Updated : 23 Oct 2023 7:08 PM IST
Tags:    
Next Story
Share it
Top