Home > జాతీయం > అంబులెన్స్లో పోలీసుల పాడు పని.. పక్కన ఖైదీ ఉండగానే ఆగలేక..!

అంబులెన్స్లో పోలీసుల పాడు పని.. పక్కన ఖైదీ ఉండగానే ఆగలేక..!

అంబులెన్స్లో పోలీసుల పాడు పని.. పక్కన ఖైదీ ఉండగానే ఆగలేక..!
X

కొన్ని కొన్ని సార్లు ఒక్కరు చేసిన పనికి అందరినీ అనాల్సి వస్తుంది. శాంతి భద్రతలను కాపాడి, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే బాధ్యత మరిచారు. పోలీస్ వ్యవస్థ పరువు తీశారు. ఎక్కడా.. ఇంకెప్పుడూ దొరకనట్లు పక్కన ఖైదీ ఉండగానే.. అంబులెన్స్ లో మందు పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వాళ్లంతా సదరు పోలీసులపై తీవ్రంగా మండి పడుతున్నారు.

పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్ పూర్ లో అంబులెన్స్ ను పోలీసులు బార్ గా మార్చారు. హోషియార్ పూర్ సెంట్రల్ జైలు అంబులెన్స్ లో పోలీసులు మందు సేవించారు. చీర్స్ కొడుతూ పెగ్గులు లాగించారు. దీన్ని ఆ అంబులెన్స్ ను ఫాలో అవుతున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో వీళ్ల బండారం బయటపడింది. దీంతో సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.


Updated : 19 July 2023 8:36 PM IST
Tags:    
Next Story
Share it
Top