Home > జాతీయం > Praggnanandhaa: చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. గ్రాండ్ మాస్టర్‌ను దాటేసిన ప్రజ్ఞానంద..

Praggnanandhaa: చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. గ్రాండ్ మాస్టర్‌ను దాటేసిన ప్రజ్ఞానంద..

Praggnanandhaa: చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. గ్రాండ్ మాస్టర్‌ను దాటేసిన ప్రజ్ఞానంద..
X

యువ గ్రాండ్‌ మాస్టర్‌ ర‌మేశ్‌బాబు(ఆర్‌) ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి నంబర్‌ వన్‌ ప్లేయర్‌గా అవతరించాడు. తన కెరీర్‌లో అగ్రశ్రేణి క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద నిలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. బుధవారం జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్​ను (చైనా) ఓడించి ఈ ఘనత అందుకున్నాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో నిలవగా - చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్‌ తరఫున టాప్‌ ప్లేయర్‌గా ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌ అగ్రస్థానంలోకి ఎగబాకాడు. అంతేకాకుండా విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత క్లాసికల్‌ చెస్‌ విభాగంలో వరల్డ్ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా రికార్డుకు ఎక్కాడు.

భార‌త నెంబ‌ర్ వ‌న్ చెస్ ప్లేయ‌ర్‌గా ర్యాంక్ సాధించిన ప్రజ్ఞానంద‌పై ప్రశంస‌లు కురుస్తున్నాయి. అదానీ గ్రూపు చైర్మెన్ గౌత‌మ్ అదానీ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో చెస్ ప్లేయ‌ర్‌ను కీర్తించారు. ప్రజ్ఞా సాధించిన ఘ‌న‌త ప‌ట్ల గ‌ర్వంగా ఉన్నట్లు తెలిపారు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ డింగ్ లీరెన్‌ను ఓడించి, ఇండియ‌న్ టాప్ ప్లేయ‌ర్ కావ‌డం అద్భుత‌మ‌ని పేర్కొన్నారు. మ‌న దేశానికి ఇది నిజంగా గ‌ర్వకార‌ణ‌మ‌ని అన్నారు.




Updated : 17 Jan 2024 1:33 PM IST
Tags:    
Next Story
Share it
Top