Home > జాతీయం > Radisson Drug case:అవును.. ఎప్పుడూ ఆ హోటల్‌లోనే పార్టీలు చేసుకుంటాం

Radisson Drug case:అవును.. ఎప్పుడూ ఆ హోటల్‌లోనే పార్టీలు చేసుకుంటాం

Radisson Drug case:అవును.. ఎప్పుడూ ఆ హోటల్‌లోనే పార్టీలు చేసుకుంటాం
X

హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే... రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌(Heroin) సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఒకానొక సందర్భంలో హెచ్చరించారు కూడా . రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నా డ్రగ్స్‌ సరఫరాదారులు, వినియోగదారుల్లో మార్పు వస్తున్న దాఖలాలు కానరావడం లేదు. తాజాగా గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని సమాచారం.

రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు దాడి చేశారు. పట్టుబడిన వారిలో 2009లో శేరిలింగంపల్లి నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద కుమారుడు వివేకానందతో పాటుగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. వీరంతా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుని పార్టీ చేసుకుంటున్నట్టు అక్కడ దాడి చేసిన పోలీసులు గుర్తించారు. గత మూడు రోజులుగా వీరు రాడిసన్ హోటల్ లో ఉంటూ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని, డ్రగ్స్ తో పాటు అక్కడ మద్యం కూడా ఏరులై పారుతుందని తెలుసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ కేసులో ఇద్దరు అమ్మాయితో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ హోటల్‌లో ఆదివారం అర్ధరాత్రి విందు ఏర్పాటు చేసుకొని.. మత్తు పదార్థాలు, కొకైన్ స్వీకరించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు దాడులు నిర్వహించి మంజీరా గ్రూప్‌ డైరెక్టర్‌ వివేకానంద అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కొకైన్‌ను పేపర్‌ రోల్‌లో చుట్టి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తరచూ అదే హోటల్‌లో పార్టీలు చేసుకుంటామని నిందితుడు వివేకానంద్‌ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. వివేకానంద్‌తో పాటు పార్టీలో కేదార్, నిర్భయ్, క్రిష్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నారు. వీరిలో వివేకానంద్‌, కేదార్, నిర్భమ్‌లను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.

ఇక ఇదే కేసులో ఒక టాలీవుడ్ నిర్మాత పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన నిర్మాతగా ఇంకా సినిమాలు మొదలు పెట్టలేదు. 2020లో ఒక స్టార్ హీరో మరో స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇక ఆయన మరో స్టార్ హీరోకి వ్యాపార భాగస్వామి అని కూడా చర్చ జరుగుతోంది. ఇక మరో వ్యాపారవేత్త సందీప్ మీద కేసు నమోదు చేశారు. శ్వేత అనే సెలబ్రిటీతో పాటు లిషిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో నీల్ అనే వ్యక్తితో పాటు ఖుషి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు

గత కొన్నేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ బాగా పెరగిపోయింది. ఈ క్రమంలోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులతో ప్రత్యేక సమావేశాలు, సమీక్షలు జరుపుతూ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే చెప్పారు. యాంటీ నార్కోటిక్‌ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని.. యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్ట్‌ర్‌ను నియమించడంతోపాటు అవసరమైన నిధులు, వనరులు సమకూర్చుతున్నారు కూడా. అయినప్పటికీ నగరంలో ఎక్కడో చోట డ్రగ్స్ వినియోగిస్తూ చాలామంది యువత పట్టుబుడుతున్నారు.

Updated : 26 Feb 2024 12:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top