Home > జాతీయం > Raghunandan Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఆదేశాలతోనే సీఎంను కలిశారు : రఘునందన్ రావు

Raghunandan Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఆదేశాలతోనే సీఎంను కలిశారు : రఘునందన్ రావు

Raghunandan Rao  : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఆదేశాలతోనే సీఎంను కలిశారు : రఘునందన్ రావు
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఆదేశాలతో వారంతా సీఎంను కలిశారని అన్నారు. మెదక్ ఎంపీ సీటుపై కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెదక్ ఎంపీ టికెట్ కవిత అడుగుతున్నారని.. ఈ క్రమంలో హరీష్ రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరదీశారని మండిపడ్డారు. హరీష్ రావుకు తెలియకుండానే నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అని ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్లను పరోక్షంగా హెచ్చరించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హరీష్ రావు రేవంత్ వద్దకు పంపారని రఘునందన్ రావు ఆరోపించారు. అన్నీ కుదిరితే మెదక్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు. సీట్లు అమ్ముకోవడం, డబ్బు దండుకోవవడమే బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ను నాశనం చేసేందుకు తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్లారిటీ

కాగా సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు కలవడం చర్చనీయాంశం అయ్యింది. వారంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని వారు ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రేవంత్ను కలిసినట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజాసమస్యలపై సీఎం, మంత్రులను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయని.. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. తమకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని.. కేసీఆర్ వెంటే ఉంటామని నలుగురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


Updated : 24 Jan 2024 8:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top