Home > జాతీయం > Phone Hack : బీజేపీ మా ఫోన్లు హ్యాక్ చేస్తుంది: రాహుల్ గాంధీ

Phone Hack : బీజేపీ మా ఫోన్లు హ్యాక్ చేస్తుంది: రాహుల్ గాంధీ

Phone Hack : బీజేపీ మా ఫోన్లు హ్యాక్ చేస్తుంది: రాహుల్ గాంధీ
X

కేంద్ర ప్రభుత్వం విపక్ష (ఇండియా కూటమి) నేతల ఫోన్లు హ్యాక్ చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు యాపిల్ కంపెనీ నుంచి మెయిల్స్ వచ్చాయని పలువురు ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తో పాటు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేత పవన్‌ ఖేరా ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్లంతా సోషల్ మీడియా అకౌంట్స్ లో తమకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేస్తున్నారు. అందులో ప్రభుత్వం తరుపు హ్యాకర్లు ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని, దానివల్ల సున్నితమైన సమాచారంతో పాటు, కెమెరా, మైక్రోఫోన్ ల ఆక్సెస్ తీసుకునే ప్రమాదం ఉందని వచ్చింది.

ఎంపీల ఫోన్లు హ్యాక్ చేయడం దారుణమని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్, అసదుద్దీన్, రాఘవ్ చద్దా లాంటి నేతల ఫోన్లు కూడా హ్యాక్ అయినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీ చర్య ఎమర్జెన్సీ కన్నా దరుణమని, ఫోన్లు హ్యాక్ చేస్తే భయపడేవాళ్లు ఇక్కడెవరూ లేరని విమర్శించారు. అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్ లు చేస్తున్నారని, దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. విపక్షాల ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుందని, యాపిల్ కంపెనీ స్పష్టత కోసం ఎదురుచూడలేకపోతున్నారని మండిపడ్డారు.

Updated : 31 Oct 2023 8:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top