Home > జాతీయం > Rahul Gandhi : రాహుల్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

Rahul Gandhi : రాహుల్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

Rahul Gandhi  : రాహుల్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు
X

కాంగ్రెస్ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ వెళ్లగా అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో కార్యకర్తలతో కలిసి ఆయన బైఠాయించి ఆందోళన చేపట్టారు.

అనంతరం రాహుల్‌గాంధీ షెడ్యూల్‌ ప్రకారం మోరిగావ్‌ జిల్లాలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే జిల్లా యంత్రాంగం దానికి బ్రేకులు వేసింది. మరోవైపు బిహుతోలిలో నిర్వహించే స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌కు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. రాహుల్ మీటింగ్ సందర్భంగా దుండగులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందన్న కారణంతో యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

అధికారుల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం ప్రజలు తన యాత్రలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. అసోంలోని 17 జిల్లాల మీదుగా 833 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది.




Updated : 22 Jan 2024 6:46 PM IST
Tags:    
Next Story
Share it
Top