Home > జాతీయం > దీదీ ఎఫెక్ట్..! రాహుల్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ చేంజ్

దీదీ ఎఫెక్ట్..! రాహుల్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ చేంజ్

దీదీ ఎఫెక్ట్..! రాహుల్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ చేంజ్
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. దానికి భారత్ జోడో న్యాయ్ యాత్రగా పేరు మార్చారు. జనవరి 14వ తేదీన మణిపూర్ లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 6,700 కిలోమీటర్లు. 100 లోక్ సభ నియోజక వర్గాలను కవర్ చేస్తూ 66 రోజులు సాగనుంది. మార్చి 21న ముంబైలో ముగియనుంది. కాగా ఈ యాత్ర ఇవాళ (జనవరి 25) అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ లోకి ప్రవేశించింది. అయితే చివరి నిమిషంలో యాత్ర రూట్ మ్యాప్ ను మార్చుతున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ముందు ప్లాన్ చేసినట్లు కాకుండా.. వెస్ట్ బెంగాల్ లోని ఉత్తరాది జిల్లాల మీదుగా యాత్రను త్వరగా ముగించి.. బిహార్ లోకి ప్రవేశించేలా రూట్ మ్యాప్ ను మార్చారు. సీపీఐ(ఎం)తో నాయకులతో పాటు.. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీ నేతలంతా ఈ యాత్రలో రాహుల్ తో కలిసి పాల్గొన్నారు. కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ఎక్కడా కనిపించలేదు.

తాజాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా రాహుల్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో మార్పు చేసినట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లో యాత్రను త్వరగా ముగించి.. మరో వారం రోజుల్లోగా మళ్లీ తిరిగి బెంగాల్ లోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. కాంగ్రెస్ కు బాగా పట్టున్న మాల్దా, ముర్షిదాబాద్ నియోజకవర్గాల్లో తర్వాత యాత్రను కొనసాగిస్తారని సమాచారం. కాగా తృణమూల్ కాంగ్రెస్ తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. మరోవైపు సమాజ్ వాదీ పార్టీతోనూ కాంగ్రెస్ కు సరిగా పొసగడం లేదని తెలుస్తుంది.



Updated : 25 Jan 2024 5:07 PM IST
Tags:    
Next Story
Share it
Top