Home > జాతీయం > వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి కారణం అదే - రాహుల్ గాంధీ

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి కారణం అదే - రాహుల్ గాంధీ

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి కారణం అదే - రాహుల్ గాంధీ
X

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా తుదిపోరులో చతికిల పడింది. టోర్నీలో 10 మ్యాచ్లలో అద్భుతంగా రాణించిన భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ఈ క్రమంలో టీమిండియా ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్లు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిచేదేనని అన్నారు. కానీ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి చెడు శకునం వచ్చినందుకే ఓటమి పాలైందని చెప్పారు.

టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఓడిపోయేందుకు ప్రధాని మోడీనే కారణమని రాహుల్ పరోక్షంగా విమర్శలు చేశారు. టీవీల్లో ఈ విషయాన్ని చూపించకపోయినా ప్రజలకు ఇండియా ఎందుకు ఓడిపోయిందో తెలుసని అన్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఫైనల్‌లో భారత్ ఓడిన అనంతరం ఆయన డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు.

Updated : 21 Nov 2023 6:15 PM IST
Tags:    
Next Story
Share it
Top