Home > రాజకీయం > వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉండదు : రాహుల్ గాంధీ

వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉండదు : రాహుల్ గాంధీ

వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉండదు : రాహుల్ గాంధీ
X

కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. దేశం మొత్తం ఈ విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘బీజేపీని మట్టికరిపించగలమని కర్నాటకలో నిరూపించాం. అయినా కర్నాటకలో వాళ్లను కేవలం ఓడించలేదు. తుడిచిపెట్టేశాం. కాంగ్రెస్ ను ఓడించడానికి బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పారాడింది. వాళ్ల వెంట మొత్తం మీడియా ఉంది. మాకంటే వాళ్లదగ్గర 10 రెట్లు ఎక్కువ డబ్బుంది. ప్రభుత్వం, ఏజెన్సీ ఇలా అన్నీ ఉన్నాయి. అయినా వాటన్నింటికీ లొంగని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు’ అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ సహా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా కర్నాటకలో జరిగిందే రిపీట్ అవుతుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.


Updated : 4 Jun 2023 3:48 PM IST
Tags:    
Next Story
Share it
Top