Home > జాతీయం > లాలూ చెప్తుంటే మటన్ వండిన రాహుల్ గాంధీ

లాలూ చెప్తుంటే మటన్ వండిన రాహుల్ గాంధీ

లాలూ చెప్తుంటే మటన్ వండిన రాహుల్ గాంధీ
X

భారత జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశం మొత్తం చుట్టేశారు. ప్రస్తుతం ఇంతకు ముందులా తిరగకపోయినా..టైమ్ దొరికినప్పుడల్లా ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మెకానిక్, రైతులను కలసుకున్న రాహుల్ ఈ సారి ఓ రాజకీయ ప్రముఖుడితో కలిసి మటన్ వండారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాహుల్ కలిశారు. లాలూ సూచనలతో చంపారన్ మటన్ వండారు. ఎలా వండాలి.. ఏది ఎంత వేయాలని లాలూ చెబుతుంటే రాహుల్ వండారు. మటన్ వండుతున్న సమయంలో రాహుల్, లాలూ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రాజకీయాలకు సంబంధించి సీక్రెట్ మసాలా ఏంటని రాహుల్ అడగ్గా.. కష్టపడి పనిచేయడమేనని లాలూ జవాబిచ్చారు. పాలిటిక్స్‌లో కూడా అన్నీ కలిపేయడం లాలూకు అలవాటు అంటూ రాహుల్ జోక్ చేశారు. ‘‘అవును..నేను అదే చేస్తా. అన్నీ కలిస్తేనే రాజకీయాలు సాధ్యం అవుతాయి’’ అంటూ లాలూ కామెంట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మటన్ తిన్నారు.

తనకు వంట వచ్చుగానీ ఎక్స్పర్ట్ను మాత్రం కాదని రాహుల్ చెప్పారు. ‘‘యూరప్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు వంట నేర్చుకోవాల్సి వచ్చింది. చిన్న చిన్న వంటకాలను చేస్తాను. లాలూ మాత్రం అద్భుతంగా వంట చేస్తారు. అద్భుతంగా వంట వచ్చిన భారత రాజకీయనేతల్లో లాలూ ముందుంటారు అని రాహుల్ చెప్పారు. ఇక తాను ఏడు తరగతిలో ఉన్నప్పుడే వంట నేర్చుకున్నట్లు లాలూ తెలిపారు. ‘‘నా సోదరుల పాట్నాలో పనిచేసేవారు. వారిని కలిసేందుకు పట్నా వెళ్లా. అక్కడ వాళ్లకు నేనే వంట వండేవాన్ని. వంట చెరకు సేకరించడం, అంట్లు తోమడం, మసాలా నూరడం.. అన్నీ అక్కడే నేర్చుకున్నా’’ అని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


लोकप्रिय नेता, लालू जी से उनकी सीक्रेट रेसिपी और ‘राजनीतिक मसाले’ पर दिलचस्प बातचीत हुई।

Updated : 3 Sept 2023 9:29 AM IST
Tags:    
Next Story
Share it
Top