Rahul Gandhi : అక్కడి ఆలయంలోకి రాహుల్కు నో ఎంట్రీ.. కాంగ్రెస్ ఫైర్
X
అసోంలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో బటద్రవ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే రాహుల్ లోపలికి వెళ్లకుండా ఆలయ కమిటీ అడ్డుకుంది. ఆలయంలోకి అనుమతి లేదని చెప్పింది. అయితే ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేంత నేరం నేను ఏం చేశానంటూ రాహుల్ ప్రశ్నించారు. గొడవలు సృష్టించడం తన ఉద్దేశ్యం కాదని.. కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్లిపోతానని రాహుల్ చెప్పిన ఆలయ కమిటీ సభ్యులు వినిపించుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ క్రమంలో ఆలయ కమిటీ తీరును నిరసిస్తూ రాహుల్ రోడ్డుపై బైఠాయించారు. ఉన్నతాధికారులు ఆదేశాలతోనే ఆలయ కమిటీ సభ్యులు తనను అడ్డుకున్నారని రాహుల్ మండిపడ్డారు. చివరకు ఆలయంలోకి ఎవరు వెళ్లాలో కూడా మోదీయే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ వేళ రాహుల్ గాంధీ బటద్రవకు వెళ్తే ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని.. న్యాయ యాత్ర రూట్ మార్చుకోవాలని సీఎం హిమంత బిశ్వ శర్మ కోరారు.