Home > జాతీయం > Rahul Gandhi : రైల్వే స్టేషన్‌లో సూట్‌కేస్ మోసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : రైల్వే స్టేషన్‌లో సూట్‌కేస్ మోసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : రైల్వే స్టేషన్‌లో సూట్‌కేస్ మోసిన రాహుల్ గాంధీ
X

భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తన స్టైల్ మార్చేశారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజలతో కలిసిపోతున్నారు. ఎక్కువగా జనాల్లోనే ఉంటూ పార్టీని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా గురువారం

ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే కూలీలను కలిశారు రాహుల్ గాంధీ. వాళ్లతో చాలా సేపు మాట్లాడారు. వారితో మాట్లాడి పనిలో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దాని పరిష్కారంపై వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఆ తరవాత పోర్టర్ డ్రెస్ వేసుకున్నారు. బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నారు. అంతే కాదు. కూలీలా ఓ సూట్‌కేసుని కూడా మోశారు రాహుల్. ఆనంద్ విహార్ స్టేషన్‌ వద్ద ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. వయనాడ్‌ ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి సాధారణ కూలీలా సామాన్లు మోయడాన్ని చూసేందుకు కూలీలు, ప్రయాణీకులు ఆసక్తి చూపారు..రాహుల్‌కు అనుకూలంగా కూలీలు చేసిన నినాదాలతో రైల్వే స్టేషన్‌ పరిసరాలు మారుమోగాయి.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిసే సమయంలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ఇక్కడ ఆటో డ్రైవర్లు, కూలీలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా సమస్యలను ప్రభుత్వం ముందు నివేదిస్తానని చెప్పారు. మా అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని ఆ వ్యక్తి చెప్పాడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ యాత్రలో భాగంగా ఆయన ఈరోజు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. గత నెలలో కూలీలు రాహుల్ గాంధీని కలుసుకుని తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.


Updated : 21 Sept 2023 12:23 PM IST
Tags:    
Next Story
Share it
Top